ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు - స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్విలెన్స్ బృందాలకు నేతృత్వం వహించే అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

local body elections
పంచాయతీ ఎన్నికలు

By

Published : Feb 6, 2021, 5:41 PM IST

పంచాయితీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్లు నోటిఫై చేసిన జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్విలెన్స్ బృందాలకు నేతృత్వం వహించే అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, అనంతపురం, విశాఖ జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫై చేసిన జోనల్ అధికారులకు ఈ మెజిస్టీరియల్ అధికారాలను ఇస్తూ న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత ఉత్తర్వులు ఇచ్చారు.

భారత నేర శిక్షాస్మృతిలోని 174(4) 176, 37, 34, 133, 143 సెక్షన్ల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ముగిసే వరకూ నోటిఫై చేసిన అధికారులను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్​గా పరిగణిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details