Vegetarian village: వివాహాలు, పుట్టిన రోజు ఇలా ఏ వేడుకైనా మాంసాహార వంటకాలు చేయడం మాములైపోయింది. తెలంగాణ ప్రాంతంలో అయితే ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాంటి చోట మాంసం తినకుండా వేరే వారిని కూడా మాంసానికి, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు. అదే నిర్మల్ జిల్లా ముధోల్ మండలం మచ్కల్ గ్రామం. ఈ గ్రామంలో సుమారు వెయ్యి మంది ఉంటారు. అన్ని కులాల వారు ఉండే ఈ గ్రామంలో... సుమారు 30, 40 సంవత్సరాల నుంచి ఏ విందు కార్యక్రమం నిర్వహించినా కేవలం శాకాహారమే తీసుకోవడం అలవాటైపోయింది. అది ఒక సాంప్రదాయంగా వస్తోంది. దీనిని ఆ గ్రామస్థులు అందరూ పాటిస్తున్నారు.
నా కళ్లతోటి చూడలేదు... మా ఊరిలో మాంసం అసలే ముట్టరు. నా వయస్సు ఇప్పటివరకు 46 ఉంటుంది. నేను పుట్టిననాటి నుంచి మా ఊరిలో మేకను కోశారు అని నా కళ్లతోటి చూడలేదు. చాలా గ్రామాల్లో పిల్లలు వ్యసనాలకు లోనవుతున్నారు. దావత్ల పేరుతో ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు. ఇలా వెజిటేరియన్‌గా ఉండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. -సూర్యవంశీ గోవింద్రావు, గ్రామస్థుడు