ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో విస్తరిస్తోన్న లంపీస్కిన్​ వ్యాధి.. ప్రభుత్వం అప్రమత్తం - నిజామాబాద్​ జిల్లా పశువుల్లో లంపిస్కిన్​ వ్యాధి

Lumpy skin disease is spreading in Telangana:తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో లంపీస్కిన్‌ వ్యాధి ప్రబలుతోంది. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్​, జోగుల గద్వాల్​ జిల్లాల్లో ఆవు, గేదె జాతి పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని పశువులకు లంపీస్కిన్ వ్యాధి ప్రభావం కనిపిస్తుండటంతో పశుసంవర్థక శాఖ టీకాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసింది.

Lumpy skin disease
లంపీస్కిన్​ వ్యాధి

By

Published : Oct 9, 2022, 2:19 PM IST

Lumpy skin disease is spreading in Telangana: తెలుగురాష్ట్రాల్లోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి ఎల్ఎస్​డీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ముద్ద చర్మ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో లక్షల్లో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి ఆ వ్యాధి ప్రవేశించడం ద్వారా ఆవు, గేదె జాతి పశువుల్లో తీవ్రప్రభావం చూపి పశువులు మరణిస్తున్నాయి.

తాజాగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ మండలం లో లంపిస్కిన్ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి.నవిపేట్ మండలంలోని తుంగిని, నలేశ్వర్ గ్రామాలలో 5 ఆవులకు గడ్డలు కనిపిస్తున్నాయి అని రైతులు తెలిపారు. రైతులు పశువైద్య అధికారికి సమాచారం అందించగా వైద్య అధికారులు పరిశీలించి లంపిస్కిన్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న అవుల నుంచి రక్తనమునాలను సేకరించి ల్యాబ్​కు పంపించారు. ఎల్లారెడ్డిలో లక్షణాలతో లేగ దూడ మృతి చెందింది. నందిపేట్, బాన్సువాడలో ఉన్న పశువులకు వ్యాధి లక్షణాలు కనిపించాయి.

గద్వాల్​ జిల్లాలో మూడు ఎద్దులు మృతి.. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులను ముద్దచర్మ (లంపీ స్కిన్‌) వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఈ రోగ లక్షణాలతో మూడు ఎద్దులు మృత్యువాత పడటం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇరవై రోజుల కిందట రాజోలి మండలంలో ఓ ఎద్దు ఇదే రోగంతో మృతి చెందిందని పశువైద్య అధికారులు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువులకు ఈ వ్యాధి సోకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,502 పశువులకు లంపీస్కిన్‌ లక్షణాలు కనిపించినట్లు అధికారులు గుర్తించారు.

జిల్లాలో 70వేల పశువులు ఉన్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిలో 50వేల పశువులకు టీకాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. మిగతా వాటికి సోమవారం నుంచి ఇస్తామని పేర్కొన్నారు. పశువులకు జ్వర లక్షణాలు ఉంటే మొదటి రోజే పశు వైద్యశాలకు తీసుకొని వస్తే వెంటనే ఈ వ్యాధిని నివారించవచ్చన్నారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు జిల్లాలో మూడు ఎద్దులు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details