ఎల్‌ఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు ఏఎంఆర్‌డీఏ పరిధిలో వచ్చిన వ్యక్తిగత ప్లాట్లలో 20 శాతమే పరిష్కారం అయ్యాయి. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత దస్త్రాలను సరిచూసుకుని ఆమోదం తెలిపేందుకు చాలా సమయం పడుతోంది. దీనికి తోడు కొవిడ్ కారణంగా జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన గడువును ఈనెలాఖరు వరకు పెంచింది. ఎల్‌ఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం అవుతోంది.
1,137 దరఖాస్తులు పరిష్కారం..
ఏఎంఆర్డీఏ పరిధిలోకి వచ్చే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 110 దరఖాస్తులు అందాయి. వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 5,468 అర్జీలు వచ్చాయి. వీటిల్లో కృష్ణా జిల్లాల నుంచే అధికంగా వచ్చాయి. సెంట్రల్ జోన్ పరిధిలోని విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భారీగా 2,075 వచ్చాయి. ఉయ్యూరు .. 735, నందిగామ .. ప్రాంతాల నుంచి 651 అందాయి.
గుంటూరు జోన్ నుంచి 811, సత్తెనపల్లి, తెనాలి జోన్ల నుంచి 60 చొప్పున అర్జీలు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలనలో అధికారులు తలమునలకలై ఉన్నారు. లేఅవుట్ల దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 40 దరఖాస్తులను పరిశీలించారు. ఇప్పటి వరకు వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణ అర్జీలలో 1,137 దరఖాస్తులను పరిష్కరించారు. ఇందులో 514 ప్లాట్లకు సంబంధించి ప్రక్రియ అంతా పూర్తి అయింది. సంబంధిత యజమానులు రుసుము కూడా చెల్లించారు.
ఇప్పటి వరకు రూ. 50 కోట్ల ఆదాయం
ఏఎంఆర్డీఏ పరిధిలో దాదాపు రెండు వేల వరకు అనధికార లేఅవుట్లు ఉంటాయన్నది అధికారుల అంచనా. నందిగామ జోన్ పరిధిలోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వెంబడి చాలా లేఅవుట్లు ఉన్నా, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందినవి తక్కువే అని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాసెస్ అయిన దరఖాస్తుల ద్వారా రూ. 50 కోట్ల మేర ఆదాయం లభించింది. అన్ని అర్జీల పరిశీలన పూర్తి అయితే రూ. 300 కోట్లు పైగా వస్తుందని భావిస్తున్నారు.
ప్రధాన లేఅవుట్ నమూనా పరిశీలించి చేయాల్సి వస్తుండడంతో ప్రక్రియ బాగా ఆలస్యం అవుతోంది. దీని కోసం రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌లోకి వెళ్లి ఈసీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లు తరచూ మోరాయిస్తున్నాయి. దీని వల్ల ఈసీల పరిశీలనలో జాప్యం చోటుచేసుకుంటోంది. గతంలో సంబంధిత లేఅవుట్ ఆమోదం పొందితేనే అందులోని ప్లాట్‌ను క్రమబద్ధీకరించేందుకు వీలు ఉండేది. ప్రభుత్వం నిబంధనలను సడలించింది.
సంబంధిత ప్లాట్లకు అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ఆమోదం తెలుపుతున్నారు. అనుమతి లేని లేఅవుట్లలో వ్యక్తిగత ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు నష్టపోకుండా ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.ఆ లేఅవుట్లలో ఇంకా అమ్ముడు పోని ప్లాట్లకు దీనిని వర్తింపజేయలేదు. వాటికి 14 శాతం ఖాళీ స్థలం చూపించాల్సి ఉంది. కొవిడ్ కేసులు భారీగా నమోదైన సమయంలో ఈ కార్యక్రమం ఆగిపోయింది. నెల నుంచి మళ్లీ చురుగ్గా సాగుతోంది. లేఅవుట్ క్రమబద్ధీకరణకు రాకపోయినా అందులోని ప్లాట్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా అందాయి. దీని వల్ల సంబంధిత లేఅవుట్‌ను కూడా అన్ని అంశాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి:
AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై... మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!