వాయువ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంలో అల్పపీడన ఏర్పడిందని అమరావతి వాతావారణ కేంద్రం శుక్రవారం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి...వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడి ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
Rain forecast for AP: వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం..రాష్ట్రానికి వర్ష సూచన! - వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో.. అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Rains in AP