ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో ఇక వర్షాలే..

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆర్టీజీఎస్​ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

బంగాళఖాతంలో అల్పపీడనం

By

Published : Aug 2, 2019, 1:08 PM IST

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 5 వరకు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని ఆర్టీజీఎస్​ వెల్లడించింది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారి..అలలు 4 మీటర్ల ఎత్తువరకు ఎగిసి పడతాయని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీర ప్రజలు సురక్షిత ప్రాంతలకు తరలి వెళ్లాలని సూచించింది. ఉత్తరాంధ్ర- ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఆర్టీజీఎస్​ ప్రకటించింది.

పవన దిశను ఇక్కడ గమనించండి.

ABOUT THE AUTHOR

...view details