ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Low Pressure : బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రానికి వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Low Pressure
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం

By

Published : Oct 16, 2021, 11:46 AM IST

ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర కోస్తాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గాలుల కారణంగా సముద్రంలో అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున.. రేపటి వరకూ మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి : Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు.. "సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఇండస్ట్రీ 4.0" మంజూరు

ABOUT THE AUTHOR

...view details