ఒడిశాలోని ఉత్తర తీరానికి సమీపంలో దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 3 - 4 రోజులలో పశ్చిమ దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. ఆగస్టు 23 తేదీన వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు పాటు వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర ,రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది.