వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ చత్తీస్గఢ్పై ఆవరించి ఉంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాజస్థాన్లోని బికనేర్-అజ్మీర్ల నుంచి చత్తీస్గఢ్ మీదుగా విశాఖ వరకూ రుతుపపన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ కోస్తాలోని ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
WEATHER INFORMATION: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..! - ఏపీలో అల్పపీడనం తాజా వార్తలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ చత్తీస్గఢ్పై ఆవరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు రాజస్థాన్లోని బికనేర్-అజ్మీర్ల నుంచి చత్తీస్గఢ్ మీదుగా విశాఖ వరకూ రుతుపపన ద్రోణి కూడా కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
![WEATHER INFORMATION: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..! rains at andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12919450-120-12919450-1630323007067.jpg)
rains at andhra pradesh
విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రకాశం జిల్లాలోనూ తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: