ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం బలపడి స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించి ఉందని స్పష్టం చేసింది. రాగల 12 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని.. అది వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని.. ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
WEATHER: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు..! - ap latest news
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం బలపడి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

low depression in bay of bengal
ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని... కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నాటికి అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: