అశోక్ కుమార్ అనే వ్యక్తి, తాను ప్రేమించుకున్నామని... జీవితాంతం కలిసి ఉంటానని హామీ ఇచ్చుకున్నామని... అతడికి ప్రభుత్వం ఉద్యోగం రాగానే మొహం చాటేశాడు అంటూ.. ఓ యువతి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో కమిషన్ ముందు హాజరైన ప్రియుడిని ఆమె నిలదీసింది.
''నన్ను ప్రేమించావ్.. దగ్గరికి తీసుకున్నావ్... గర్భవతిని చేశావ్... పెళ్లి చేసుకుంటానని చెప్పి అబార్షన్ చేయించావ్.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకు వదిలేశావ్. వేరే పెళ్లి చేసుకుని నన్ను ఎందుకు మోసం చేశావ్'' అంటూ యువతి బోరున విలపించింది. ఆగ్రహించిన అశోక్ ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురికి సర్దిచెప్పారు. ప్రేమ పేరుతో తన జీవితంతో ఆడుకుని, అన్యాయం చేసిన అశోక్ కుమార్ నాయక్‌ను కఠినంగా శిక్షించాలని ఆ యువతి డిమాండ్ చేసింది.