ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ప్రేమ.. పెళ్లి.. గర్భం... చివరికి బాలిక హత్యకు పన్నాగం - love fraud news

ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. తీరా... గర్భం వచ్చిందని తెలిసి... అమ్మాయిని హత్య చేయడానికి పన్నాగం పన్నాడు. ఓ బాలికను వాడుకుని గర్భం దాల్చాక చంపేందుకు యత్నించిన యువకుని తతంగం తెలంగాణ రాష్ట్రం నాగర్​ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బావాయిపల్లిలో వెలుగుచూసింది.

lover-attempted-murder-an-a-minor-girl-after-knowing-her-pregnancy
ప్రేమ.. పెళ్లి.. గర్భం... చివరికి బాలిక హత్యకు పన్నాగం!

By

Published : Jun 28, 2020, 9:42 PM IST

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బావాయిపల్లికి చెందిన ఓ బాలికతో ఆదే గ్రామానికి చెందిన వినోద్​(22) ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. తీరా గర్భం దాల్చిందని తెలియగానే... బాలికను వదిలించుకోవడం కోసం హత్య చేయడానికి కుట్ర పన్నాడు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఊరి బయటికి తీసుకెళ్లాడు. గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. అమ్మాయి కేకలు వేయటంతో చుట్టూ ఉన్న స్థానికులు రావడం గమనించి వినోద్​ అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిందంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు యువకుడి ఇంటి ముందు బైఠాయించారు.

గ్రామస్థులు కూడా బాలికకు మద్దతుగా నిలిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో.. బాధితురాలి కుటుంబ సభ్యులు నిరసన విరమించారు. నిందితుడి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల పిర్యాదుతో ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

వైరల్: కన్నీరు తెప్పిస్తున్న కరోనా బాధితుడి చివరి వీడియో!

ABOUT THE AUTHOR

...view details