హైదరాబాద్‌లోని లోటస్ ఆస్పత్రిలో(Lotus Hopaital) మల్టీ స్పెషాలిటీ సేవలను ప్రారంభిస్తున్నట్లు సీఈవో డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ తెలిపారు. లక్డీకాపూల్‌లో 2006లో ప్రసూతి సేవలతో ప్రారంభమైన ఆస్పత్రి ప్రస్తుతం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి ప్రారంభించి దిగ్విజయంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
లోటస్ ఆస్పత్రిలో (Lotus hospital)ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు వీఎస్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అనుమతులతో ఇకనుంచి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, వాస్క్యులర్, న్యూరో, లాప్రోస్కోపిక్ సర్జరీ వంటి ఆధునిక సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం నుంచి ఈ నెల 25 వరకు అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉచిత కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నామని సీఈవో డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ ప్రకటించారు. సామాన్యులకు సైతం మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఫీజులను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.