ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంకు లారీ యజమానుల సంఘం లేఖ..టోల్​ నిలిపివేయాలని విజ్ఞప్తి - టోల్ వసూళ్లపై సీఎం జగన్​కు లేఖ

రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోల్ వసూలు నిలిపివేయాలని కోరుతూ...లారీ యజమానుల సంఘం సీఎం జగన్​కు లేఖ రాసింది. కరోనా, లాక్​డౌన్​ వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగంపై మరింత భారం మోపవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికే డీజిల్​పై రూ.1.22 రోడ్ సెస్ వసూలు చేస్తున్నారన్న సంఘం..మళ్లీ టోల్ వసూలు చేయడం అన్యాయమన్నారు.

Lorry owners association
Lorry owners association

By

Published : Nov 20, 2020, 4:18 PM IST

సీఎంకు లారీ యజమానుల సంఘం లేఖ

రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం సీఎం వైఎస్ జగన్​ను కోరింది. ఈ మేరకు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు సీఎంకి లేఖ రాశారు. గత రెండేళ్లుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని...ఇటీవల లాక్​డౌన్, కొవిడ్ పరిస్థితుల వల్ల రవాణా రంగం మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లీటర్ డీజిల్​పై 1.22 రూపాయల చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తోందని, ఇప్పుడు మళ్లీ రోడ్లపై టోల్ వసూలు చేయడం అన్యాయమన్నారు.

రెండు వరుసల రోడ్లపై టోల్ వసూల వల్ల ప్రజలు, రైతులు, రవాణా రంగంపై పెనుభారం పడుతుందని సీఎం దృష్టికి తెచ్చారు. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తమ అభ్యర్థన మేరకు బ్రిడ్జిలపై టోల్ టాక్స్ రద్దు చేశారని....ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లపై టోల్ విధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు ఆలోచన విరమించుకోవాలని లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి :​'రాజకీయ పార్టీల చేతిలో ఎస్​ఈసీ రమేశ్ కుమార్ కీలుబొమ్మగా మారారు'

ABOUT THE AUTHOR

...view details