LORRY OWNERS ASSOCIATION LETTER TO CM JAGAN: రవాణా వాహనాలపై హరితపన్ను, డీజిల్ పై పన్నులు తగ్గించి.. రవాణా రంగాన్ని ఆదుకోవాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు లారీ యజమానుల సంఘం.. ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసింది. కరోనా కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. లేఖలో పేర్కొంది.రోజు వారీ ఖర్చులను నిర్వహించడం కూడా కష్టమవుతుందని, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక, డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితి నెలకొందని తెలిపారు.
LORRY OWNERS ASSOCIATION LETTER TO CM JAGAN: రవాణా వాహనాలపై హరితపన్ను, డీజిల్ పై పన్నులు తగ్గించాలి: లారీ యజమానుల సంఘం - రవాణా వాహనాలపై హరితపన్ను తగ్గించాలని సీఎంకు లారీ యజమానుల సంఘం
LORRY OWNERS ASSOCIATION LETTER TO CM JAGAN: కరోనా కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. లారీ యజమానుల సంఘం తెలిపింది. రవాణా వాహనాలపై హరితపన్ను, డీజిల్ పై పన్నులు తగ్గించి.. రవాణా రంగాన్ని ఆదుకోవాలని లారీ యజమానుల సంఘం.. సీఎం జగన్కు లేఖ రాశారు.
చాలా మంది లారీ యజమానులు.. లారీలు నడపడం మానేశారని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ పరిస్ధితుల్లోనే హరిత పన్నుల పెంపు లారీ యజమానులకు పెను భారంగా మారిందన్నారు. లారీలకు వసూలు చేయ తలపెట్టిన హరిత పన్నును తగ్గించాలని, డీజిల్ పై పన్నులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా సీఎంను కోరారు. పొరుగు రాష్ట్రాల్లో రవాణా వాహనాలపై పన్నులకు మినహాయింపు ఇచ్చారని, సరిహద్దు రాష్ట్రాల కన్నా.. రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:Centre on special status for AP: ప్రత్యేక హోదా ముగిసిన అంశం.. పార్లమెంట్లో కేంద్రం