ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్రైమాసిక పన్ను గడువును పెంచండి: లారీ యజమానుల సంఘం లేఖ - ఏపీ తాజా వార్తలు

కరోనా కారణంగా కిరాయిలు లేక లారీ యజమానులు అవస్థలు పడుతున్నారని ఏపీ లారీ యజమానుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. త్రైమాసిక పన్ను గడువును పెంచాలని కోరుతూ రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి లారీ యజమానుల సంఘం లేఖ రాసింది.

Lorry Owners
Lorry Owners

By

Published : Jan 20, 2021, 8:43 AM IST

కొవిడ్‌ కారణంగా కిరాయిలు లేక లారీ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, ప్రస్తుతం చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను గడువును మరో రెండు నెలలు పెంచాలని ఏపీ లారీ యజమానుల సంఘం కోరింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ సహా, పలు రాష్ట్రాల్లో రవాణా వాహనాలకు రెండు త్రైమాసికాల పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారని, ఏపీలోనూ దీనిని అమలు చేసేలా చూడాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు లేఖలో కోరారు.

*ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి లారీల్లో ధాన్యం రవాణాకు అనుమతించాలని మంత్రి కొడాలి నానిని ఏపీ లారీ యజమానుల సంఘం కోరింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లారీలకు తిరుగు ప్రయాణంలో కిరాయిలు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల ధాన్యం రవాణాకు అనుమతించాలని అభ్యర్థించింది.

ఇదీ చదవండి:400వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమబావుటా

ABOUT THE AUTHOR

...view details