ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Road Accident at Bhadradri: బొగ్గు లారీ బొల్తా.. నలుగురు మృతి - lorry bolta in kothagudem

Lorry Bolta in Bhadradri : వరినాట్లు వేసేందుకు వెళ్తున్న కూలీల వాహనం ప్రమాదానికి గురైంది. బొగ్గు లారీ ట్రక్ ను ఢీ కొట్టడంతో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లెలో చోటుచేసుకుంది.

Road Accident at Bhadradri
కూలీలతో వెళ్తున్న ట్రక్ ను ఢీకొట్టి.. బోల్తా పడ్డ బొగ్గు లారీ..

By

Published : Jan 28, 2022, 1:49 PM IST

Lorry Bolta in Bhadradri : వరినాట్లు వేసేందుకు వెళ్తున్న కూలీల వాహనం ప్రమాదానికి గురైంది. కూలీలు వెళ్తున్న వాహనాన్ని.. బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లెలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు.

కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బొగ్గు లారీ బోల్తా

Lorry Bolta in Thippanapalli : తెలంగాణలోని కొత్తగూడెం సుజాత నగర్​కు చెందిన సుమారు 12 మంది కూలీలు ఓ ట్రక్​లో వరినాట్లు వేసేందుకు సత్తుపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం వెళ్తున్న బొగ్గులారీ వీరి వాహనాన్ని ఢీకొట్టి.. బోల్తా కొట్టింది. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు కత్తి స్వాతి, సుజాత, లక్ష్మీ(43), సాయమ్మ(45) లను కొత్తగూడెం సమీపంలోని సుజాతనగర్‌ వాసులుగా గుర్తించారు. మరొకరి గురించి తెలియాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details