ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మట్టి విగ్రహాలను పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' - కర్నూలులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

కరోనా వైరస్ ప్రభావం వినాయక చవితి ఉత్సవాలపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున... సామూహిక వేడుకలకు అధికారులు అనుమతులు రద్దుచేశారు. అంతేకాక... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

lord vinayaka clay statues distributiion in andhraprashesh
మట్టి విగ్రాహాల పంపిణీ కార్యక్రమం

By

Published : Aug 20, 2020, 9:27 PM IST

విజయనగరం...

జిల్లాలో కరోనా దృష్ట్యా బహిరంగ ఉత్సవాలకు అనుమతి లేదని ఒకటో పట్టణ సీఐ తెలిపారు. శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవరి ఇళ్లలో వారు పూజలు చేసుకుని... పోలీసులకు సహకరించాలని కోరారు.

అనంతపురంలో...

మట్టి వినాయకుని పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ అనంతపురంలో వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. చైతన్యం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి తగ్గి... ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

విశాఖపట్నంలో...

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు... మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎస్​ఎం రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కర్నూలులో...

కరోనా నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని.. కర్నూలు ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. రెండు అడుగుల విగ్రహాలను దేవాలయాలు, అపార్టుమెంట్లు, షాపు సముదాయాల వద్ద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం ఉరేగింపుగా కాకుండా విగ్రహనికి ఐదు మంది మించకుండా చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

మంత్రి పేరుతో బెదిరింపులు.. అకౌంటెంట్​ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details