తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు కొనసాగుతుండడంతో అంతా రామమయమై సాక్షాత్కరించింది. అల్లంత దూరం నుంచి రామ క్షేత్రాన్ని చూసిన భక్తులు అదిగో భద్రాద్రి అంటూ రామ వైభవాన్ని కీర్తించారు. అధ్యాయనోత్సవాల్లో భాగంగా స్వామివారు నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెలంగాణ: నరసింహావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు - telangana latest news
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి రాముడు.. నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు భాగంగా అధ్యాయనోత్సవాల నాలుగోరోజైన శుక్రవారం హిరణ్య సంహారుడై భక్తుల పూజలందుకుంటున్నాడు.
తెలంగాణ: నరసింహావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు
వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. పూర్వకాలంలో ప్రహ్లాదుడ్ని సంహరించేందుకు హిరణ్యాక్షుడు ప్రయత్నించగా మహావిష్ణువు నరసింహ అవతారంలో ఆ రాక్షసుడిని సంహరించాడు అని పురాణాలు చెబుతున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల భూతబాధలు తొలగుతాయని ఆలయ వేద పండితులు చెప్తున్నారు.
ఇవీ చూడండి:వరాహావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య