తెలంగాణను చూశాక ఏపీ ప్రభుత్వం కూడా నూతన జిల్లాలు ఏర్పాటు చేసే యోచనలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లాల విభజన తర్వాత పరిపాలన సులభతరం అయిందని తెలిపారు. గతంలో కంటే ఆ ప్రాంతాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేసే యోచనలో సీఎం జగన్ ఉన్నారని కేసీఆర్ తెలిపారు.
ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయవచ్చు: కేసీఆర్ - ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తమను చూసి ఏపీలో కూడా త్వరలో 25 జిల్లాలు చేయబోతున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణను చూసి ఏపీలో జిల్లాల సంఖ్య పెంచాలనుకుంటున్నారు