ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీస్ స్టేషన్లకూ వైకాపా రంగులేసేయండి: లోకేష్ - recent lokesh twitter comments on govt

వైకాపా నాయకుల తీరుపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్లకూ వైకాపా రంగులు వేసేయండి.. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

నారా లోకేష్

By

Published : Nov 7, 2019, 2:00 PM IST

ప్రభుత్వంపై మండిపడిన లోకేష్

ముఖ్యమంత్రి జగన్.. ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులతోనే తెదేపా కార్యాకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వ భవనాలకు రంగులు మారుస్తున్న సందర్భాల నేపథ్యంలో.. పోలీస్ స్టేషన్లకూ రంగులు మార్చేయండి.. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details