మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. దిశ చట్టం పేరుతో చేస్తోన్న మోసాన్ని ఇకనైనా ఆపాలని, మహిళలకు రక్షణ కల్పించాలంటూ శాంతియుతంగా దిశ పోలీస్ స్టేషన్ల ముందు తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెదేపా నాయకుల నిర్బంధం, అక్రమ అరెస్టులపై పెడుతున్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం పెట్టాలని సూచించారు.
Lokesh: అక్రమ అరెస్టులపై పెడుతున్న శ్రద్ధ.. మహిళల రక్షణ కోసం పెట్టండి - తెదేపా మహిళా కార్యకర్తల హౌస్ అరెస్ట్ పై స్పందన
మహిళల హక్కులు, వారి భద్రతను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు.
తెదేపా నాయకుడు నారా లోకేశ్