రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన.. అఫ్గానిస్థాన్ తాలిబన్లనg మించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని సీఎం.. నిరుపేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. సీఎం జగన్ తన ఇంటి ముందు తొలగించిన భరతమాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించి.. క్షమాపణలు చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Lokesh: 'భరతమాత విగ్రహాన్ని తొలగించటం నిరంకుశత్వానికి నిదర్శనం'
అరాచకాల్లో వైకాపా నేతలు.. అఫ్గానిస్థాన్ తాలిబన్లను మించిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రూ.2 కోట్లతో తనకు గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి.. ఆయన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించటం నిరంకుశత్వానికి అద్దం పడుతుందని విమర్శించారు.
తెదేపా నేత నారా లోకేశ్
Last Updated : Aug 24, 2021, 3:01 PM IST