ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన 'భీమిలి భూచోళ్లు' కథనంపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైందని ధ్వజమెత్తారు. అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని సీఎం జగన్ అన్నప్పుడే తనకు అనుమానం వచ్చిందని లోకేశ్ అన్నారు. కార్యాలయాలు అటు, ఇటు మార్చడం ద్వారా ఉత్తరాంధ్ర వెలిగిపోతోందని చెప్పినప్పుడు తన అనుమానం మరింత బలపడిందని పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే స్పష్టత వచ్చేసిందని లోకేశ్ వెల్లడించారు. ఈటీవీ కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ జోడించారు.
ఉత్తరాంధ్రపై సీఎం జగన్ దండయాత్ర: నారా లోకేశ్ - విశాఖ భూదందాపై లోకేశ్ ట్వీట్
విశాఖలో జరుగుతున్న భూఅక్రమాలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారం చేసిన 'భీమిలి భూచోళ్లు' కథనంపై తెదేపా ముఖ్యనేత లోకేశ్ ట్వీట్ చేశారు. సరైన ప్రణాళిక లేకుండానే.. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ చెప్పినప్పుడు ఏదో జరుగుతుందని తనకు అనుమానం వచ్చిందని లోకేశ్ అన్నారు. అది ఇప్పుడు నిజమైందని, విశాఖలో జరుగుతున్న భూకబ్జాలు, ల్యాండ్ మాఫియా వ్యవహారాలే అందుకు నిదర్శనమన్నారు.
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్