ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 కరోనా కేసులు నమోదయ్యాయి. 135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. వారిలో 108 మందికి కరోనా నెగిటివ్ అని తేలింది. మిగిలిన 24 రక్త నమూనాల కోసం నిరీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు 1,006 మంది అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. 28 రోజుల పరిశీలన తర్వాత 259 మందిని ఇళ్లకు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 711 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించింది.
కరోనా గురించి ఇన్నాళ్లు నిజాలెందుకు దాచారు..?: లోకేశ్
కరోనా విషయంలో ప్రజలకు ఇన్నాళ్లు నిజాలు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని... నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ను ప్రస్తావించిన ఆయన... నిన్నటి వరకూ ఏపీలో కరోనా లేదంటూ మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని లోకేశ్ ఆరోపించారు.
దీనిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ముఖ్యమంత్రి జగన్ పెద్ద కుట్రకి పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా గురించి నిజాలను ఇన్నాళ్లు దాచి ప్రజలను, సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నిన్నటి వరకూ ఏపీలో కరోనా లేదంటూ మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు. ఇంతకాలం నిజాలను దాచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై కేంద్రం విచారణ చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'కరోనాతో జాగ్రత్తగా ఉంటాం.. అమరావతి పోరాటం కొనసాగిస్తాం'