పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం... గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన గరికపాటి కృష్ణ కుటుంబసభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. లక్కరాజు గార్లపాడు గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో గరికపాటి కృష్ణ గాయపడ్డారని స్థానిక నేతలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. కృష్ణ కుటుంబసభ్యులకు లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బాధితుడి కుటుంబసభ్యులకు లోకేశ్ ఫోన్లో పరామర్శ - lokesh latest news
సత్తెనపల్లి నియోజకవర్గంలో తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన గరికపాటి కృష్ణ కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు.
బాధితుడికి లోకేశ్ పరామర్శ