ఇదీ చదవండి:
'రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం' - వైకాపా పాలనపై తెదేపా
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలుగు రైతు కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతు వ్యతిరేకి అని విమర్శించారు. గతంలో.. రుణమాఫీ అవసరం లేదని జగన్ అన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రైతుకు విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలనే తమ పనులుగా చెప్పుకొంటూ డ్రామాలు చేస్తున్నారని అన్నారు.
వైకాపా పాలనపై లోకేశ్