ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రచార ఆర్భాటమే తప్ప.. మహిళలకు రక్షణ లేదు' - మహిళల రక్షణపై నారా లోకేశ్

వైకాపా ప్రభుత్వం పాలనలో మహిళలకు రక్షణ లేదని నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా పెద్ద రాజుపాలెం గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రామ వాలంటీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Lokesh on volunteer raped girl at nelore district
నారా లోకేశ్ ట్వీట్

By

Published : Jul 24, 2020, 4:51 PM IST

నెల్లూరు జిల్లా పెద్ద రాజుపాలెం గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే ఘటన అని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. వాలంటీర్ల ముసుగులో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దిశ చట్టం, 21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం, ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు అంతా ప్రచార ఆర్భాటమే తప్ప వైకాపా ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. వారం వ్యవధిలోనే మైనర్ బాలికలపై రెండు అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారా లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details