రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ అంధకారాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇళ్లలో ఫ్యాన్‌లు ఆగిపోయాయని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. బొగ్గు కొరత ఉంది జాగ్రత్త పడండని 40 రోజుల ముందు నుంచే కేంద్రం హెచ్చరిస్తున్నా.. జగన్ పట్టించుకోలేదని లోకేశ్ ట్వీట్ చేశారు.
200 కోట్ల రూపాయలకు పైగా సొంత మీడియాకు ప్రకటనల రూపంలో దోచిపెట్టిన జగన్.. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఇవ్వాల్సిన రూ.215 కోట్ల బకాయిలను చెల్లించలేదని ఆక్షేపించారు. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని దుయ్యబట్టారు.