ఉట్టికెగరలేరు కానీ... స్వర్గానికి ఎగురుతానన్నట్టు... సీఎం జగన్ వ్యవహార శైలి ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాయితీపై కిలో ఉల్లి ఇవ్వలేని వైకాపా ప్రభుత్వం దిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా ఎలా తెస్తుందని నిలదీశారు. దిల్లీలో అమిత్ షా అపాయింట్‌మెంట్ లేదు... ఇక్కడ గల్లీలో జనాలకు ఉల్లి లేదని లోకేశ్ ట్వీట్ చేశారు. జగన్ అసమర్థపాలనతో కిలో ఉల్లిపాయల కోసం జనం పడే బాధలు చూడండని పార్వతీపురం రైతుబజార్లో ప్రజలు పడుతున్న అవస్థల వీడియోను పోస్టు చేశారు. పాలన అంటే... దుష్ప్రచారం చేయడం, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవడం కాదని విమర్శించారు. మంచి చేయడమంటే ఇలా ప్రజల్ని నడిరోడ్డున పడేయడమా అని వైకాపాను ప్రశ్నించారు.
'దిల్లీలో అపాయింట్‌మెంట్ లేదు... గల్లీలో ఉల్లి లేదు'
వైకాపా అసమర్థపాలన కారణంగానే ఉల్లి ధరలు పెరిగాయని తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఆరోపించారు. గల్లీలో కిలో ఉల్లి ఇవ్వలేని వైకాపా ప్రభుత్వం... దిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా ఎలా తెస్తుందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు.
'దిల్లీలో అపాయింట్‌మెంట్ లేదు.. గల్లీలో ఉల్లి లేదు'