జర్నలిస్ట్ శివ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఎలాంటి నోటీసు లేకుండా ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడటమే అతను చేసిన తప్పా అని నిలదీశారు. వారెంట్, నోటీసు లేకుండా శివప్రసాద్ ఫోన్‌ను కూడా చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ ను స్వాధీనం చేసుకుంటున్న ఘటన ఆడియోను జర్నలిస్ట్ కుటుంబం రికార్డ్ చేసిందన్న లోకేష్..., దానిని తన ట్విట్టర్ లో విడుదల చేశారు. నోటీసులు లేకుండా తన కుటుంబం ముందే శివప్రసాద్ ను ఎందుకు కిడ్నాప్ చేశారని లోకేశ్ నిలదీశారు. సీఎం జగన్ పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వినియోగించుకోవడం విచారకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పోలీసులు తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని లోకేశ్ హెచ్చరించారు.