ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజలను గాలికి వదిలేశారు.. వైకాపా నాయకులకు అదునాతన వైద్యం అందిస్తున్నారు' - ఏపీలో కరోనా వైద్యంపై నారా లోకేశ్

వైకాపా ప్రభుత్వం కరోనా బాధితులకు వైద్యం అందిచడంలో వైఫల్యం అయ్యందని నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజలకి ఆసుపత్రుల్లో పడకలు లేవంటూ గాలికొదిలేస్తున్న ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేకు, నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తుందని దుయ్యబట్టారు.

lokesh on corona treatment in andhra pradesh
కరోనా వైద్యంపై నారా లోకేశ్

By

Published : Jul 23, 2020, 10:25 AM IST

వైకాపా ప్రభుత్వం కరోనా పరీక్షల నుంచి వైద్యం వరకూ అన్నీ అబద్ధాలే చెబుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కరోనా పెద్ద విషయం కాదన్న రోజు నుంచి అదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం అశోక్​నగర్​కి చెందిన భవానీ శంకర్ కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని చెప్పి ఇంటికి పంపారని.., వస్తుందన్న అంబులెన్స్ అడ్రెస్ లేకుండా పోయిందని.. వారిని పట్టించుకున్న నాధుడు లేడని దుయ్యబట్టారు. రెండు రోజులుగా కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణణాతీతమని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవంటూ గాలికొదిలేస్తున్న సీఎం జగన్ అధికార పార్టీ ఎమ్మెల్యేకు, నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details