రాజధాని ప్రాంతాలు... భారత్-పాక్ సరిహద్దును తలపిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శించారు. అక్కడైనా ఇంత మంది పోలీసులు ఉండరని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలని లోకేశ్ ట్విట్టర్‌లో సూచించారు.
'అమరావతి... భారత్- పాక్ సరిహద్దును తలపిస్తోంది' - tdp fires on ycp government
అమరావతిలో సీఎం జగన్ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని సూచించారు.
వైకాపా ప్రభుత్వం పై నారా లోకేశ్ వ్యాఖ్యలు