ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థుల తల్లిదండ్రులు... విద్యావేత్తలతో నేడు లోకేశ్ వర్చువల్ భేటీ

కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్నందున పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై నిర్ణయం మార్చుకోవాలని.. ఎన్ని విధాలుగా ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోవటం లేదన్నారు. పరీక్షల రద్దు డిమాండ్​పై నేడు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో లోకేశ్ సమావేశం కానున్నారు.

lokesh on tenth class exams
నారా లోకేశ్

By

Published : Apr 22, 2021, 7:54 AM IST

పదో తరగతి పరీక్షల రద్దు డిమాండ్​పై తల్లిదండ్రులు, విద్యావేత్తలతో... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్​ యాప్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. కరోనా రెండో దశ తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని... ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపినా స్పందించడంలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details