Lokesh Letter to Nirmala Sitaraman: చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై 5శాతమే భారం అనుకుంటే.. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచడమేంటని ఆయన లేఖలో ప్రశ్నించారు.
ముడిసరుకులపైనా 25శాతం మేర పన్ను పెంచినందున రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి పోయాయన్నారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాయితీలు, రుణాలు అందజేయాలన్నారు.