మంగళగిరి ఎయిమ్స్‌కి నీటి సరఫరా జాప్యంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఎయిమ్స్ మంగళగిరికి నీటి సరఫరా సమస్య పరిష్కారం అత్యవసరమని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి 2017లో 10 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఆమోదించారని.. 2018లో పాలనాపరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయని గుర్తు చేశారు. గత రెండేళ్ల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు.
LOKESH LETTER: ఎయిమ్స్ నీటి సమస్య పరిష్కరించండి: సీఎంకు లోకేశ్ లేఖ - నారా లోకేశ్ తాజా వార్తలు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. మంగళగిరి ఎయిమ్స్‌కి నీటి సరఫరా సమస్య ఉందని.. దానిని పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.
lokesh letter to jagan
ఎయిమ్స్‌కి కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నీటి కొరత కారణంగా కొవిడ్ పోరాటంలో ముందుండాల్సిన ఎయిమ్స్ వెనుకబడిందన్నారు. ఎయిమ్స్ ఏపీతో పాటు దక్షిణ భారతదేశంలోనే ప్రజలకు ఉత్తమ సేవలందించే ప్రతిష్టాత్మక రెండు సంస్థలో ఒక్కటని.. ప్రభుత్వం ఎయిమ్స్‌ను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మంగళగిరి లేదా తెనాలి కాలువ ద్వారా పైప్‌లైన్‌తో నీటి సరఫరా సమస్యను పరిష్కరించమని ఎయిమ్స్ డైరెక్టర్ ఇప్పటికే సీఎంను కోరారని పేర్కొన్నారు.