ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కుయ్, కుయ్ కాదు... కుయ్యో, మొర్రో అంటున్నాయ్' - అంబులెన్స్ లపై లోకేశ్ ట్వీట్

కుయ్, కుయ్, కుయ్ అంటూ వస్తాయని తెచ్చిన అంబులెన్స్ లు సమయానికి రావటంలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఫోన్ చెయ్యగానే వస్తుందన్న 108 ఎక్కడొచ్చిందని ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. అనుభవంలేని సంస్థకు పని అప్పగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

"కుయ్, కుయ్ ..కాదు కుయ్యో, మొర్రో అంటున్నాయ్"
"కుయ్, కుయ్ ..కాదు కుయ్యో, మొర్రో అంటున్నాయ్"

By

Published : Jul 14, 2020, 4:35 PM IST

లోకేశ్ ట్వీట్

కుయ్, కుయ్, కుయ్ అంటాయని తెచ్చిన అంబులెన్స్‌లు కుయ్యో, మొర్రో అంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కాల్ చెయ్యగానే 108 ఎక్కడ వచ్చిందని అంటూ నిలదీశారు. అవినీతి కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టుచేశారు.

అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో ప్రధానోపాధ్యాయుడు నారాయణస్వామి అస్వస్థతకు గురై నడిరోడ్డుపై పడిపోగా స్థానికులు 108కి కాల్ చేశారన్నారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారని లోకేశ్ తెలిపారు. సీఎం జగన్ కు ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణమని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details