మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఖాకీస్వామ్యంలో ఉన్నామా..? అని హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే... రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, "ఖాకిస్టోక్రసీ" కొందరు అధికారులు ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేసి కొంతమంది అధికారులు జగన్ రెడ్డితో కలిసి ఊచలు లెక్కపెట్టారని గుర్తు చేశారు.
'గతంలోనూ ఇలాగే చేశారు..కొంతమంది అధికారులు ఊచలు లెక్కపెట్టారు' - lokesh comments on police
హైకోర్టు వ్యాఖ్యలను బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని నారా లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని హరించడానికి కూడా వెనకాడటం లేదన్న లోకేశ్... కనీసం నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను ప్రసారం చేశారన్న అక్కసుతో ఓ సంస్థ ఎండీపై అక్రమ కేసు పెట్టి వేధించారని ధ్వజమెత్తారు. ఈ కేసుని కోర్టు కొట్టి వేయడం అరాచకవాదులకు చెంపపెట్టని స్పష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ... నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు