ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది: లోకేశ్ - అసెంబ్లీలో తెదేపా నేతల సస్పెన్షన్ పై లోకేశ్

Lokesh On Jangareddy gudem deaths: జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తమ పార్టీ నాటు సారా మరణాలపై సభలో చర్చకు పట్టుబట్టినా..ప్రభుత్వం మాత్రం తప్పించుకు తిరుగుతోందని ధ్వజమెత్తారు.

తెదేపా జాతీయ ప్రధనా కార్యదర్శినారాలోకేశ్‌
తెదేపా జాతీయ ప్రధనా కార్యదర్శినారాలోకేశ్‌

By

Published : Mar 16, 2022, 4:17 PM IST

Lokesh Fired On AP govt about Jgudem deaths: జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నాటు సారా మరణాలపై సభలో చర్చకు పట్టుబట్టినా.. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దారుణమన్నారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. మూడ్రోజుల నుంచి సభలో చర్చకు రాకుండా తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు.

సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది -లోకేశ్

జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి చెప్పేదొకటి, చెప్పేదొకటని లోకేశ్‌ దుయ్యబట్టారు. సారా మరణాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకెంత మంది చనిపోతారో అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సీరియస్ గా మాట్లాడుతుంటే సభలో మంత్రులు నవ్వుకుంటున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నాటుసారా మరణాలపై నిలదీస్తే.. సభ నుంచి సస్పెండ్ చేశారు -తెదేపా

ABOUT THE AUTHOR

...view details