అధికారంలోకి వచ్చిన 9 నెలలుగా.. తుగ్లక్ సమేత వైకాపా పరివారం 'గోబ్యాక్' అంటూనే ఉన్నారని.. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమకు రావాల్సిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ జీఎన్. రావు కమిటీతో రిపోర్ట్ ఇప్పించి ఉత్తరాంధ్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలను 'గోబ్యాక్' అంటూ తరిమేశారని మండిపడ్డారు. హుద్‌హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా అని ట్విట్టర్ ద్వారా నిలదీశారు. దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించారని ధ్వజమెత్తారు.
తుగ్లక్ సమేత వైకాపా పరివారం గోబ్యాక్: లోకేశ్ - వైకాపా ప్రభుత్వంపై ట్విట్టర్లో లోకేశ్ వ్యాఖ్యలు
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు గోబ్యాక్ అంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా వైకాపా నేతలందరూ గోబ్యాక్ అంటూ రాష్ట్రానికి వస్తున్న కంపెనీలను వెళ్లగొడుతున్నారని ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు
Last Updated : Feb 27, 2020, 12:38 PM IST