ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపాకు వేణుమాధవ్ సేవలు వెలకట్టలేనివి: లోకేశ్ - latest news on lokesh condolences to venumadhav

హాస్యనటుడు వేణుమాధవ్ మృతికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. పార్టీకి చేసిన ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

తెదేపాకు వేణు మాధవ్ సేవలు వెలకట్టలేనివి: లోకేశ్

By

Published : Sep 25, 2019, 10:00 PM IST

ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. హాస్యనటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి వేణుమాధవ్ మరణం విచారకరమన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు... అతను పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details