'రంగుల డబ్బులతో.. డ్వాక్రా మహిళల రుణాలు తీరేవి' - lokesh comments on ysrcp government
మీ ఇంటికొస్తే ఏమిస్తావు...మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అనే విధంగా జగన్ పాలన ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వేసిన రంగులకు1300 కోట్లు, వాటిని తీస్తే 1300 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డ్వాక్రా మహిళలకు రుణాలైనా తీరేవని హితవు పలికారు. తుగ్లక్ రివర్స్ పాలన ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ వ్యాఖ్యలు