ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య హత్య ఘటనను.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న సీమలో నెత్తురు పారిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అండతో దుండగులు పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు.
ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై అధికార గర్వాన్ని అణిచివేస్తారని హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యే అవినీతిని బయట పెట్టినందుకే కక్ష గట్టి చేనేత వర్గం నాయకుడు సుబ్బయ్యపై దాడికి ఒడిగట్టారని మండిపడ్డారు. అన్యాయంగా నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంతో ఆ పిల్లలకు తండ్రిని తేగలరా అని నిలదీశారు.