ఓటేసిన వారినే జగన్ కాటేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మద్యపాన నిషేధం పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రకాష్‌ని బలితీసుకున్నారని ఆరోపించారు.
ఓటేసిన వారినే జగన్ కాటేస్తున్నారు: నారా లోకేశ్ - నారా లోకేశ్ వార్తలు
వైకాపా దాష్టీకానికి మరో దళిత యువకుడు బలి అయ్యాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఆరోపించారు. మద్యపాన నిషేధం పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సామాజిక మాధ్యమాల్లో ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన దళిత యువకుడు ఓం ప్రకాష్‌ని బలితీసుకున్నారని లోకేశ్ మండిపడ్డారు.
చంపేస్తాం అంటూ వైకాపా నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమాల మండలం కందూరు గ్రామంలో ఓం ప్రకాష్ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం ప్రకాష్ మృతి పై విచారణ చేపట్టాలని... ఘటన వెనుక ఉన్న వైకాపా ముఖ్య నాయకులను కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.