జగన్ అండ్ కో ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులని మరోసారి నిరూపించుకున్నారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధర రెండింతలు పెంచి... ప్రజల నెత్తిపై గుదిబండ వేశారని ధ్వజమెత్తారు.
'ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులు మీరు' - nara lokesh twitter
వైకాపా ప్రభుత్వంపై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్... ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
నారా లోకేశ్... ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు
ఏపీలో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక... అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని ఆరోపించారు. ఇసుక కొనడానికి ప్రజల ఇళ్లు గుల్ల అవుతుంటే... దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి... ఇళ్లు సరిపోక వైకాపా నేతలు విదేశాలకు వెళ్లి వస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండీ... అమరావతికి చంద్రబాబు... తాజా పరిణామాలపై నేతలతో చర్చ