ప్రైవేటు కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసిన వైకాపా ప్రభుత్వ చర్యను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం జగన్ రెడ్డికి మంచిది కాదని హితవు పలికారు. జీవోని వెనక్కి తీసుకుని... పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని లోకేశ్ ఆరోపించారు. ఎన్నికల ముందు కూతలు కోసి...అధికారం వచ్చాకా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ పిల్లలకు మాత్రమే విదేశాల్లో చదువులాని నిలదీశారు. బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అర్హులు కారా అని ప్రశ్నించారు.
మీ పిల్లలకు మాత్రమే విదేశీ చదువులా?: నారా లోకేశ్ - nara lokesh latest news
ప్రైవేటు కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్