ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సవరణలు కోరితే మండలిని రద్దు చేస్తారా..?: లోకేశ్ - lokesh comments on three capitals for AP news

మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా... వెంటనే రద్దు చేయరని తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్ వివరించారు. బిల్లులపై సవరణలు కోరితే మండలిని రద్దు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

lokesh comments on council cancellation
lokesh comments on council cancellation

By

Published : Jan 26, 2020, 10:48 PM IST


సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపినా... వెంటనే రద్దు చేయరని వివరించారు. ఎందుకు రద్దు చేస్తారో ప్రభుత్వం తగిన కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి గెజిట్ ఇచ్చేవరకు మండలి ఉంటుందని... సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు వైకాపా పాలనలో పెట్టుబడులు రావడంలేదని... దావోస్ సదస్సుకు కూడా ఆహ్వానం అందలేదన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులను తెలంగాణ తన్నుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లమాధ్యమం బిల్లును మండలిలో తిరస్కరించలేదని... కేవలం సవరణ కోరామని స్పష్టం చేశారు. బిల్లులపై సవరణ ఇచ్చినంత మాత్రాన మండలిని రద్దు చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details