రాష్ట్రంలో ఇసుక మాయం అవుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 70 మందిని బలి తీసుకున్న తరువాత కూడా సీఎం జగన్ ఇసుక దాహం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దొరక్కుండా చేసి అడ్డదారిలో రేట్లు పెంచి అమ్ముకుంటూ ప్రజలను కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు.
స్వయంగా వైకాపా శాసనసభ్యుడే కొంచెం ఇసుక కూడా గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నాం అని గోడు వెళ్లగక్కారంటే ఇసుక మాఫియా అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు.