నియంత సర్కారు నిర్బంధాలను ఎదిరించి పోరాడుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమకారులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభివందనాలు తెలిపారు. 550 రోజులుగా సాగుతున్న శాంతియుత పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వెలకట్టలేని త్యాగాలు చేసిన రైతులవైపు ధర్మం ఉందన్న లోకేశ్.. ఆలస్యమైనా న్యాయపోరాటంలో విజేతగా నిలిచి.. అందరి అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుందని ఆకాంక్షించారు.
Amaravati: అమరావతి పరిరక్షణ ఉద్యమకారులకు నారా లోకేశ్ అభివందనాలు - 550వరోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం
అమరావతి ఉద్యమానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమకారులకు అభివందనాలు తెలిపారు.
నారా లోకేశ్