ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ నుంచే లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలు - govt order on lokayuktha activities

రాష్ట్రంలో ఏర్పాటైన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు ప్రస్తుతానికి హైదరాబాద్​ నుంచే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఈ రెండు కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఇలాగే కొనసాగుతాయని సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

లోకాయుక్త కార్యకలాపాలు

By

Published : Sep 27, 2019, 11:57 PM IST

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచే పని చేస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. విజయవాడలో ఈ రెండు కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నందున తాత్కాలికంగా అక్కడి నుంచే పని చేస్తాయని తెలిపింది. హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని లోకాయుక్త సంస్థ​ నుంచే అధికారులు విధులు నిర్వహిస్తారని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఇలాగే కొనసాగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవలే ఏపీ లోకాయుక్తగా జస్టిస్​ లక్ష్మణ్​రెడ్డి నియమితులయ్యారు.

ABOUT THE AUTHOR

...view details